Top
Sneha TV

కేసీఆర్‌ సింహమా? అయితే జూలో పెట్టాలి: వీహెచ్

X

హైదరాబాద్‌:

కేసీఆర్‌ను సింహంలా కేటీఆర్‌, కవిత అభివర్ణిస్తున్నారని, నిజంగానే సింహమైతే కేసీఆర్‌ను జూపార్క్‌లో పెట్టాలని జూ అధికారులకు లేఖ రాస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతారావు అన్నారు. తెలంగాణలో డిక్టేటర్‌ పాలన సాగుతోందని, గతంలోని దొరల పాలనను గుర్తుకు తెస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు.

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను మోదీ, అమిత్‌షా ఖండించాలని వీహెచ్ అన్నారు. తెలంగాణలో రెండు ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ఒక ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ అయితే మరో ప్రభుత్వానికి సీఎం ఒవైసీ అని ఆయన విమర్శించారు.

Next Story
Share it