Top
Sneha TV

ఈడీ ఎదుట హాజరైన సుజనాచౌదరి

X

చెన్నై:

టీపీపీ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్రమాజీమంత్రి సుజనాచౌదరి బ్యాంకులకు మోసం కేసులో సోమవారం ఆయన ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఎదుట హాజరయ్యారు. బ్యాంకులకు రూ.5,700కోట్ల మోసం చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చెన్నై ఈడీ కార్యాలయంలో సుజనాచౌదరిని అధికారులు విచారించారు. వివిధ అంశాలపై సుమారు 5గంటల పాటు సుజనాచౌదరిని ప్రశ్నించారు.గతనెల 24న సుజనా చౌదరి నివాసం, రెండు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు రావాల్సిందిగా 27న సమన్లు జారీ చేశారు. అయితే ఈడీ సమన్లు రద్దు చేయాలని ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం సుజనా చౌదరి పిటిషన్ కొట్టివేస్తూ ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఇవాల ఈడీ ముందు హాజరయ్యారు.

Next Story
Share it