Top
Sneha TV

రైతుల ఆత్మహత్యలు ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ

X

రైతుల ఆత్మహత్యలు ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ

రైతుల ఆత్మహత్యలు బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కువ జరిగాయని ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యలు తెలంగాణ కంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో అధికంగా జరిగాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బీజేపీలు తప్పుదోవపట్టించే యత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ఓ జాతీయపార్టీకి తోకలాగా ఉండాలని చంద్రబాబు పాకులాడుతున్నాడని ఎంపీ వినోద్ విమర్శించారు.

Next Story
Share it