Top
Sneha TV

మేము వస్తే కాళేశ్వరం.. కూటమి వస్తే శనేశ్వరం..

X

వరంగల్ జిల్

వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ గెలిస్తే కాళేశ్వరం నీళ్లు వస్తాయని.. కూటమి వస్తే శనేశ్వరం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పనులు 90శాతం పూర్తయ్యాయని, వానాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు. కాళేశ్వరం కట్టొద్దంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని ఆయన ఆరోపించారు.

వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం పరితపించే వ్యక్తి ఆరూరి రమేష్. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా 116 ఇస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని మంత్రి హరీష్ తెలిపారు.

Next Story
Share it