Top
Sneha TV

ఆలీబాబా.. నలుగురు దొంగలు: సిద్ధు

X

తెలంగాణ

ఆలీబాబా నలుగులు చోర్లు ఉన్నారని కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు విమర్శించారు. తెలంగాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ... కేసీఆర్ ఆలీబాబా అయితే.. నలుగురు దొంగలు కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ లు అని విమర్శించారు. ప్రధాని మోడీ, కేసీఆర్ దొందు దొందే అన్నారు. మోడీ అకౌంట్ లో 15లక్షలు అన్నారు అది మరిచారని తెలిపారు. తెలంగాణాలో ఒక కుటుంబం కోసం ప్రభుత్వం ఉందన్నారు. రూ. 300 కోట్ల బంగ్లా నుంచి కేసీఆర్ బయటికు రావటం లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ బాంబు ట్రీ లాగ ఉందని ఆరోపించారు. లోపల అంత డొల్లే అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రెండున్నర లక్షల అప్పులు చేశారని వివరించారు.

కేటీఆర్ కుటుంబం ఆస్తి మాత్రం నాలుగు వందల రేట్లు పెరిగిందని ఆరోపించారు. జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుతుంటే ఏ ప్రభుత్వం నిలువలేదని గుర్తు చేశారు. తెలంగాణాలో మహిళా సాధికారత అంటే కవిత వక్కరేనా అని ప్రశ్నించారు. మోడీ రైతులకు రుణాలు ఇవ్వరు కానీ.. అదానీ, అంబానీ కంపెనీలకు మాత్రం రుణ మాఫీ చేశారని విమర్శించారు. కేసీఆర్ ఓ జాదూగర్ అని ఆరోపించారు. ఒక్క ప్రాణహిత ప్రాజెక్టులోనే నలభై వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. ఓకే స్ట్రోక్ లో మోడీ నలభై వేల కోట్లు అంబానీకి కట్టబెట్టారని వెల్లడించారు. బ్యాంకులకు వేల కోట్లు ముంచిన మాల్యా, నిరవ్ మోదీకీ బీజేపీ నేతల కుమారులే లాయర్ లు అని వెల్లడించారు. నోట్ల రద్దు తర్వాత అమిత్ షా కుటుంబ సభ్యుల అకౌంట్ లో కోట్లు ఎలా జమ అయ్యాయో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళ గ్రూప్ కు లక్ష గ్రాంట్ .. ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మోడీ ఏ దేశమైనా వెళ్ళవచ్చు... నేను మాత్రం నేను పాకిస్థాన్ వెళితే తప్పేంటి అని ప్రశ్నించారు. నన్ను ప్రేమించే వారి దగ్గరకి వెళితే తప్పేంటీ అని సిద్దు నిలదీశారు.

Next Story
Share it