Top
Sneha TV

తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

X

ఆర్మూర్‌ :

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆర్మూర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అందులో భాగంగానే తొలి ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ నేత జీవన్‌రెడ్డి అరాచకాలపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Next Story
Share it