Top
Sneha TV

ప్రజాకూటమికి తలసాని జూ హూజూర్ అనాలి: రమణ

X

హైదరాబాద్:

కామన్ మినిమమ్ ప్రొగ్రాంతో ప్రజా కూటమి బయలుదేరిందని, కేసీఆర్ కుటుంబ కూటమికి తలసాని లాంటి తొత్తులు... భాగస్వాములు అయ్యారని టీటీడీపీ నేత ఎల్. రమణ విమర్శించారు. బుధవారం సాయంత్రం సనత్‌నగర్‌లో జరుగుతున్న ప్రజా కూటమి సభలో ఆయన మాట్లాడుతూ ఆనాడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు నవాబులు జీ హుజూర్ అన్నారో.. అలాగే తలసాని లాంటివాళ్లు కూడా ప్రజా కూటమికి జీ హుజూర్ అనాల్సిందేనని, తలవంచుకోవాల్సిందేనని రమణ అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it