Top
Sneha TV

తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరమా?: కేసీఆర్

X

మెదక్‌:

ప్రజాస్వామ్యంలో పార్టీలు ముఖ్యం కాదని, ప్రజల అభీష్టం గెలవాలని కేసీఆర్ అన్నారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్-టీడీపీ ఒకవైపు.. నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒకవైపు ఉన్నాయని, ఈ రెండింటి మధ్యే అసలైన పోటీ ఉందన్నారు. బుధవారం ఆందోల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును శనిలా నెత్తిన పెట్టుకుందని నిప్పులు చెరిగారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని ప్రజలను కేసీఆర్ కోరారు. జనాలు లేక నారాయణ ఖేడ్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సభ వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పెత్తనం పోవాలంటే అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాదని, అన్ని ఎంపీ సీట్లలలోనూ టీఆర్ఎస్ గెలిపించాలని పిలుపునిచ్చారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యం అన్నారు

Next Story
Share it