Top
Sneha TV

ఇప్పుడైనా కేసీఆర్‌ దళితుడిని సీఎం చేస్తారా?: అమిత్‌షా

X

అదిలాబాద్:

తెలంగాణ ధనిక రాష్ట్రమని, అలాంటిది కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రూ. రెండున్నర లక్షల కోట్ల అప్పులు మోపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అదిలాబాద్‌లో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడుతూ ప్రజల కోసం నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ మాటిచ్చారని, తెలంగాణ వచ్చిన తర్వాత మాటతప్పారని ఆయన విమర్శించారు. ఇప్పుడైనా కేసీఆర్‌ దళితుడిని సీఎం చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడి కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినాన్ని జరపడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని అమిత్‌షా హామీ ఇచ్చారు.

Next Story
Share it