Top
Sneha TV

ఇంత తెలివిత క్కువ ప్రధానని అనుకోలేదు: కేసీఆర్

X

ప్రదాని నరేంద్రమోదీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్‌లో కరెంట్ నీటి సమస్య ఉందని మోదీ చెప్పడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి దమ్ముంటే విమర్శలు చేసిన నిజామాబాద్‌లోనే చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారన్న వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. మోదీకి కళ్లున్నాయో లేదో... ఎవరు రాసిచ్చారో.. ఏం చదివారో తనకు అర్థం కాలేదని అన్నారు. ఇంత తెలివితక్కువ ప్రధాని అని తాను అనుకోలేదని అన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్, మోదీకి సవాల్ విసిరారు. నిజామాబాద్‌లోనే చర్చకు తాను సిద్ధమని అన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణ కరెంటు సమస్యలు ఉన్నాయని ప్రచారం చేయడం ఎంతవరకు సబబని ఆయన అన్నారు.

ఇంతకు ముందు అమిత్ షా కూడా తెలంగాణ పర్యటనకు వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడారని, చేసిన ఆరో్పణలు రుజువు చేస్తే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చూసినట్లు కేసీఆర్ చెప్పారు. లేదా షా క్షమాపణలు చెప్పి అబిడ్స్ వద్ద ముక్కు నేలకు రాయాలని చెప్పానని ఆయన అన్నారు. మోదీకి కూడా సవాల్ చేస్తున్నానని, ఆయనకు అర్థమవ్వాలనే హిందీ, ఇంగ్లష్‌లో మాట్లాడి సవాల్ చేసినట్లు కేసీఆర్ స్సష్టం చేశారు. తాను ఎవరికి భయపడనని, తానేమైనా చంద్రబాబు నాయుడునా? భయపడడానికి.. తనదంతా తెరిచిన పుస్తకమని కేసీఆర్ పేర్కొన్నారు.

Next Story
Share it