Top
Sneha TV

కేసీఆర్‌పై నిప్పులు చెరిగి పుదుచ్చేరి సీఎం!

X

యాదాద్రి: గులాబీ బాస్ కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో సోనియాను దేవత అన్న కేసీఆర్‌.. రాష్ట్రం ఏర్పడిన తరువాత రంగులు మార్చారని దుయ్యబట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉందన్నారు. ఉద్యోగ కల్పన, దళితులకు మూడెకరాల భూమి, సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లరని, మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వరని, ప్రజలకు అందుబాటులో ఉండరని నారాయణ స్వామి విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కేసీఆర్‌ను ఓడించాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

Next Story
Share it