Top
Sneha TV

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా: కేఏ పాల్

X

హైదరాబాద్

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వెల్లడించారు. తెలంగాణలో టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వివిధ పార్టీలకు చెందిన 43 మంది రెబల్స్ తనను కలిశారని తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన కేఏ పాల్.. తెలంగాణలో ఎవరు గెలిచినా.. కొద్దిపాటి మెజారిటీతోనే అధికారంలోకి వస్తారని జోష్యం చెప్పారు. ఏపీలో జనసేన పార్టీకి ఆశించినంతగా మైలేజీ రావటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఇరు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.

Next Story
Share it