Top
Sneha TV

ఆ ఇద్దరూ మోదీ, కేసీఆర్‌కు ఏజెంట్లు: రఘువీరా

X

తిరుపతి: మోదీ, కేసీఆర్‌కు జగన్‌, పవన్‌ ఏజెంట్లు అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన రఘువీరా రెడ్డి.. జగన్, పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఏ పార్టీకి మద్దతిస్తారో జగన్, పవన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకే పోటీ చేయలేనివారు.. పార్లమెంట్‌కు పోటీ చేస్తారా? అని పవన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయడం ఎందుకు? అని అన్నారు. డిసెంబర్ 15 తర్వాత ఏపీలో పొత్తులపై నిర్ణయం ఉండొచ్చు అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని ఏపీలో 72% మంది కోరుకుంటున్నారని అన్నారు.

Next Story
Share it