Top
Sneha TV

రోహిత్‌ శర్మతో తలనొప్పి

X

బ్రిస్బేన్‌:

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీని పక్కన పెడితే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తమకు తలనొప్పి తెప్పించగలడని ఆస్ట్రేలియా పేసర్‌ నేథన్‌ కౌల్టర్‌నైల్‌ అన్నాడు. అతడిని వేగవంతమైన ఇన్‌స్వింగర్లతో ఉచ్చులో పడేయాలని లేదంటే షార్ట్‌పిచ్‌ బంతులతో పరీక్షించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీతో పాటు రోహిత్‌ను ఔట్‌ చేయడం కీలకమని నేథన్‌ పేర్కొన్నాడు. 'అతడో నమ్మశక్యం కాని ఆటగాడు. రికార్డులే అతడి గురించి చెప్తాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచి గణాంకాలు నమోదు చేశాడు. అందుకే అతడిని ఓ కంటకనిపెట్టడం అవసరం. అయితే రోహిత్‌ను కొత్త బంతితో బోల్తా కొట్టించడంలో మాకు అనుభవం ఉంది. జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ చివరిసారి ఆడినప్పుడు రోహిత్‌ను ఔట్‌ చేశాడు. ఈ సారీ త్వరగా అదే చేయాలని కోరుకుంటున్నాం' అని నేథన్‌ కౌల్టర్‌ నైల్‌ అన్నాడు.

రోహిత్‌ శర్మకు ఆస్ట్రేలియాలో మంచి రికార్డే ఉంది. ఎనిమిదేళ్ల కాలంలో అక్కడ 62.31 సగటుతో 810 పరుగులు చేశాడు. ఈ సారి ఆసీస్‌ తురుపుముక్క బెహ్రెన్‌డార్ఫ్‌ అయ్యే అవకాశముంది. గతేడాది గువాహటిలో జరిగిన టీ20లో 21 పరుగులిచ్చి టాప్‌ఆర్డర్‌ 4 వికెట్లు తీశాడు. అందులో కోహ్లీ, రోహిత్‌ సైతం ఉన్నారు. బెహ్రెన్‌డార్ఫ్‌ బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేస్తున్నాడని కౌల్టర్‌నైల్‌ అన్నాడు.

Next Story
Share it