Top
Sneha TV

కేసీఆర్ పథకాలే గెలిపిస్తాయి: ఎర్రబెల్లి

X

కేసీఆర్ పథకాలే గెలిపిస్తాయి: ఎర్రబెల్లి

వరంగల్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం పాలకుర్తిలో ఎన్నికల ప్రచారసభ నిర్వహించనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకరరావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టన పథకాలే టీఆర్ఎస్‌ను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడూ జరగనంత పెద్ద ఎత్తున సభ జరుగుతుందని అన్నారు. ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అందరి దేవుళ్ల ఆశీర్వాదంతో కేసీఆర్ తొలి సభ ఇక్కడ పెట్టడం జరిగిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, ఇంకా కొన్ని గ్రామాలకు నీరు అందించాల్సి ఉందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని ఎర్రబెల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ఎంతో అభివృద్ది జరిగిందని ఆయన అన్నారు

Next Story
Share it