Top
Sneha TV

మాల్దీవుల అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి మోది

X

మాలే:

మాలే: భారత ప్రధాని మోది మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్‌ సోలీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోది హాజరుకావడానికి వచ్చారు. నగరంలోని నేషనల్‌ స్టేడియంలో శనివారం సాయంత్రం మాల్దీవుల అధ్యక్షుడు ప్రమాణం చేయనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోది మాల్దీవులకు రావడం ఇదే తొలిసారి. ప్రమాణ స్వీకారం అనంతరం సోలీ, మోదితో సమావేశం కానున్నారు. మరలా ఈ రాత్రికే మోది అక్కడ నుంచి బయల్దేరి వస్తారు.

Next Story
Share it