Top
Sneha TV

టికెట్లు పంచుకోలేనోళ్లు.. పాలన చేస్తారా?: హరీష్

X

మెదక్‌

మెదక్‌: టికెట్లు ఇచ్చుకునే సామర్థ్యం లేనోళ్లు రాష్ర్టాన్ని పాలిస్తారా? అని హరీష్ రావు ప్రశ్నించారు. శనివారం నర్సాపూర్‌లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. మహాకూటమి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోదండరాం, పొన్నాల లక్ష్మయ్య ఇద్దరూ టికెట్‌ల కోసం కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు పోటీనివ్వని కాంగ్రెస్.. ప్రతిపక్ష హోదా కోసమే పోరాటం చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందన్నారు.

Next Story
Share it