Top
Sneha TV

శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తారు: జగన్

X

విజయనగరం

విజయనగరం: వైసీపీ అధినేత జగన్ కోడికత్తి ఘటన తర్వాత తొలిసారి జిల్లాలోని పార్వతీపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ సంస్థల్ని శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తారని ధ్వజమెత్తారు. పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బాగా దోపిడీలకు పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్ వాడీ పోస్టులను కూడా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా వదిలిపెట్టడం లేదని జగన్ ఎద్దేవా చేశారు. పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువగా ఉన్నారని, అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు కాజేస్తున్నారని జగన్ ఆరోపించారు.

జిల్లాలో 26 కరవు మండలాలుంటే వాటిలో 4 మండలాల్లో మాత్రమే కరవు ఉందని చంద్రబాబు అంటున్నారని అన్నారు. రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయైనా కరీఫ్, రబీ రైతులకు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండి ఏం గడ్డి తింటున్నారని వ్యాఖ్యానించారు. పునాదులు మాత్రమే కట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లు చంద్రబాబు చెబుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చంద్రబాబు తన మనవడిని కూడా తీసుకెళ్తున్నారని విమర్శించారు

Next Story
Share it