Top
Sneha TV

ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు : నలుగురు మృతి

X

థానే :

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాహాపూర్ వద్ద ఇవాళ ఉదయం 7 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 16 ఏళ్ల అబ్బాయి, క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు దంపతులు ఉన్నారు. ఘటనాస్థలికి స్థానిక ఎమ్మెల్యే పాండురంగ్ బరోరా, పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించేందుకు ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు.
Next Story
Share it