Top
Sneha TV

మైండ్‌గేమ్ ఆడుతున్న రేవంత్‌రెడ్డి ఖబడ్దార్...

X

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఖానాపురం(వరంగల్ రూరల్): రాష్ట్రంలో 100 సీట్లు, వ రంగల్‌లో 12కు 12 సీట్లు టీఆర్‌ఎస్ గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఖానాపురంలో నర్సంపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటింటి ప్రచారంలో ఎంపీ సీ తారాంనాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఇంటిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సం క్షేమ పథకాల వల్ల లబ్ధిపొందినవారు ఉన్నారన్నారు. తాను పాల్గొన్న ఎన్నికల ప్రచారాల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేస్తామని అన్నారన్నారు. పెద్ది సుదర్శన్‌ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

అలాగే ఎంపీ సీతారాంనాయక్‌ మాట్లాడుతూ... పెద్ది కృషి, కేసీఆర్‌ ఆశీర్వాదంతో పాకాల, రంగాయ చెరువు ప్రాజెక్ట్‌లను సాధించిన ఘనత పెద్దికే దక్కుతుందన్నారు. తాను పార్టీ వీడుతానని వస్తున్న వార్తలో వాస్తవాలు లేవని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రేవంత్‌రెడ్డి నోరును అదుపుపెట్టుకొని మాట్లాడాలన్నారు. మైండ్‌గేమ్‌ ఆడుతున్న రేవంత్‌ ఖబర్ధార్‌ అన్నారు.

Next Story
Share it