Top
Sneha TV

ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు "రాష్ట్రపతి పాలన" కు దారి తీస్తున్నాయా?

X

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ లో మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని పరితపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా తన వ్యుహా రచన చేస్తూ, కేంద్రంపై సమరానికి కాలుదువ్వే కీలక నిర్ణయాలు తీసు కుంటున్న తరుణంలో, ఆయన కలలకి కేంద్రప్రభుత్వం బ్రేకులు వేయాలని అనుకుంటోం దని అంటున్నారు విఙ్జులు.

పరిస్థితుల తీవ్రతను ఘాడతను అతి దగ్గర నుండే గమనిస్తున్న కేంద్రం రాష్ట్రపతి పాలన విధించి చంద్రబాబుకి "చెక్" పెట్టటం తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్లు గా విశ్వసనీయవర్గాల సమాచారం.

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు గవర్నర్ నరసింహం ద్వారా వివరాలు తెలుసు కుంటున్న కేంద్రం ఇప్పుడు చంద్రబాబు నిరంకుశత్వానికి - చెక్ పెట్టాలని, ఆయన తీరును ఫెడరల్ వ్యవస్థపై, దేశ ఐఖ్యతపై దాడిగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అయితే కేంద్రప్రభుత్వం "రాష్ట్రపతి పాలనను విధించడానికి చూపగల కారణాలు ఏమిటి? ఎలాంటి పరిస్థితుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని విధించే ప్రయత్నం చేస్తున్నారు అంటే దానికి సంపూర్ణంగా చంద్రబాబు నడవడి అనుసరిస్తున్న జాతి ప్రజా వ్యతిరేఖ విధానాలే అంటున్నారు. ఆయనే కేంద్రానికి మార్గాన్ని సుగమం చేశారని తెలుస్తోంది.

* విశాఖ విమానాశ్రయంలో - ఏకంగా ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటన, రాష్ట్రంలోని శాంతిభద్రతల క్షీణతగా చెప్పవచ్చు. అంతే గాకుండా అందు లోని కుట్ర కోణాన్ని మరుగు పరచేటందుకు ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ అత్యున్నతాధికారి ప్రవర్తించిన తీరు, అసలు నేపధ్యంలోని ప్రధాన నేరస్తుణ్ని విచారించక పోవటం, అదీ ఒక కులాధిపత్య సమాజం సృష్టించటానికి ప్రభుత్వం వ్యవస్థలే పూనుకోవటం ఇదంతా రాష్ట్రంలో నెలకొన్న అరాచక వాతావరణానికే సాక్ష్యంగాచెప్పవచ్చు.

*దాదాపు సిఎం రమేష్, సుజానా గ్రూప్, బీరం మస్తాన్ రావు గ్రూపు తదితరాల్లో ఇప్పటికే ₹800 కోట్ల అవినీతి జరిగినట్లు ఆదాయపుపన్ను శాఖ దాడుల్లో ఋజువైన దరిమిలా ఏపీ ప్రభుత్వం సీబీఐని రాష్ట్ర ప్రవేశాన్ని నిషేధిస్తూ తాజాగా జారీచేసిన ఉత్తర్వులు మరో కారణమని అంటున్నారు.

ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి, తరువాత గవర్నర్ నేరుగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి - డిజిపికి ఫోన్ చేయడం, ఆ సంఘటన వివరాలు తెలుసు కోవడం అప్పట్లో పెద్ద సంచలనం కలిగింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడిని ఈ ఘటన తీవ్రంగా కలవరపెట్టింది. ఇప్పుడు ఇదే అంశాన్ని సాకుగా చూపి స్తూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన తీసుకువస్తారని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రకటించారు కూడా.

అంతేకాదు అనేకసార్లు చంద్రబాబు ఇదే అంశాన్ని అనేక సార్లు శాసనసభలో, బహిరంగ వేదికలపైన, మంత్రిమండలి సమావేశాల్లోను ఇంకా అనేక అధికారిక, అనధికారిక సమావేశాల్లో కూడా ప్రస్తావించారు..

ఇదిలా ఉండగానే చంద్రబాబు నాయుడు తాజాగా బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని కట్టాలని ఉధ్యుక్తుడవటం బిజెపి అగ్రనేతలకి నషాళానికి ఎక్కేంత ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో నారా చంద్రబాబు నాయుడుని అన్ని వైపుల నుంచి "అష్టదిగ్బంధనం" చేస్తూ వచ్చారు, బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలోనే ఏపీలో బలమైన కార్యచరణ అవసరం అనుకున్న తరుణంలో చంద్రబాబు స్వయంగా కేంద్రానికి ఆయుధం ఇచ్చారు..అదే సిబిఐ పై ఆంధ్ర ప్రదేశ్ నిషేధం విధించడం ఇప్పుడు బిజెపికి ఇది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతోంది. ఇది దేశ ఐఖ్యతకు, ఫెడరల్ స్పూర్తికి, విఘాతమని కేంద్రం భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించటంతో పాటు, నేఱగాళ్లపై విచారణ చేయకుండా హర్షవర్ధన్ చౌదరి లాంటి వాళ్ళని కాపు గాస్తూ అనామకులను కేసుల్లో ధారుణంగా ఇరికిచటం వంటి దుర్మార్గపు పనులతో పాటు, రాష్ట్రంలో కేంద్ర సంస్థల ప్రవెశాన్ని నిషేధించడం వంటి అక్రమాలు - సమాజానికి అంత శ్రేయస్కరం కాదని అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం "డిస్మిస్" చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి వివిధ పథకాలకు అందించిన ఆర్ధిక సహకారం లెక్కలు చెప్పకుండా ఉండటం, అమరావతి కోసం భూసేకరణలో జరిగిన అవకతవకలు, పలుమార్లు అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనల పేరుతో ప్రజాధనం దుబారా చేయటం, రాష్ట్రంలో అనేకమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపేరుతో చేసిన దోపిడీ అవినీతిపై కేంద్రాని కి అందిన పిర్యాదులు అన్నింటిని పరిగణలోకి తీసుకొని,ఈ కారణాలతో ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

ఇక్కడ మరొక మెలిక ఏమిటంటే - రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే బీజేపీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ని చూపించి ప్రజల నుంచి సానుభూతి సంపాదించా లనేది చంద్రబాబు గారి శకుని తరహా చాతుర్యంగా ఉండవచ్చని విశ్లేషకు ల అభిప్రాయం అని తెలుస్తుంది. ఇలాంటి చంద్రబాబు ఇంద్రజాలములో చిక్కుకోకుండా, చంద్రవ్యూహాన్ని కేంద్రం ఎలా నిరోదిస్తుందో వేచి చూడాలి.

Next Story
Share it