Top
Sneha TV

'కేటీఆర్ సవాల్‌కు నేను సై'

X

నల్లగొండ : టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ విసిరిన రాజకీయ సన్యాసం సవాల్‌కు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 'సై' అన్నారు. కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు. మహాకూటమి అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల్లో ఉండబోనని ప్రతి సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ కేటీఆర్‌ దా..? కేసీఆర్‌ దా..? అని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఇకపై తాను రాజకీయాల్లో కనిపించను.. వినిపించను.. అంటూ కేటీఆర్ విసిరిన సవాల్‌పై స్పందించారు. కేసీఆర్ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించామన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇచ్చామని తెలిపారు. టికెట్ల కేటాయింపుల్లో అసంతృప్తులు సహజంగానే ఉంటాయని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు.

టిఆర్ఎస్‌లో టికెట్ల కేటాయింపులో ఉద్యమకారుల గొంతు కోశారని ఆరోపించారు. త్వరలోనే తెలంగాణలో సోనియా గాందీ, రాహుల్ గాంధీ పర్యటిస్తారని వెంకట్ రెడ్డి తెలిపారు. నల్లగొండలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it