Top
Sneha TV

టిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్న కాంగ్రెస్‌ నేత

X

హైదరాబాద్‌: పార్టీ టికెట్‌ కోసం నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో వలసలు ప్రారంభమయ్యాయి. టికెట్‌ ఆశించి చివరకు రాదని తెలిసి భంగపడ్డ నేతలు వలసలే బ్రహ్మాస్త్రంగా చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నుంచి మంచిర్యాల నేత, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో కేసిఆర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనే కాక కాంగ్రెస్‌ నుంచి ఇంకొంత మంది టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Next Story
Share it