Top
Sneha TV

చంద్రబాబుకు షాకివ్వనున్న ఇద్దరు ఎంఎల్ఏలు

X

గుంటూరు జిల్లాలోని ఇద్దరు ఎంఎల్ఏలు చంద్రబాబునాయుడికే షాకివ్వాలని డిసైడ్ అయినట్లున్నారు. చాలాకాలంగా చంద్రబాబుతో సఖ్యత లేని కారణంగా వాళ్ళిద్దరికి టిక్కెట్లు అనుమానమే అంటున్నారు. ఎలాగూ అనుమానం వచ్చిన తర్వాత ఇంకెందుకు తెలుగుదేశంపార్టీలోనే ఉండాలన్నది వారిద్దరి వాదన. అందుకే వాళ్ళిద్దరు వైసిసి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో టచ్ లో ఉన్నారని సమాచారం. జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే వాళ్ళిద్దరూ టిడిపిలో నుండి వైసిపిలోకి జంప్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాడు ఎంఎల్ఏ రావెల కిషోర్ బాబులు రివర్స్ లో చంద్రబాబుపై మండిపోతున్నారు. కారణమేదైనా కానీ మొదటి నుండి కూడా పై ఇద్దరికి చంద్రబాబుతో సఖ్యత కుదరలేదు. దాంతో పార్టీ శ్రేణులు కూడా వీరిద్దరికీ దూరంగానే ఉంటున్నారు. మంత్రిపదవి నుండి రావెలను తప్పించిన తర్వాత గ్యాప్ మరింత పెరిగింది. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అర్హులకు అందటం లేదని మోదుగుల ఎన్నోసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయటం అందరికీ తెలిసిందే.

వీళ్ళద్దరూ ఎంత అసంతృప్తిని వ్యక్తం చేసినా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. దాంతో మెల్లిగా పార్టీ కార్యక్రమాలకు కూడా వీళ్ళిద్దరూ దూరమైపోతున్నారు. ఈ సమయంలోనే ఇద్దరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కేది కూడా అనుమానమే అని టిడిపి నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అందుకనే వీళ్ళద్దరరూ వైసిపితో టచ్ లోకి వెళ్ళారు. తనకు నరసరావుపేట ఎంపి సీటు కావాలని మోదుగుల అడిగితే జగన్ కుదరదని చెప్పారని సమాచారం. అదేవిధంగా రావెల ప్రత్తిపాడులో టిక్కెట్టు అడిగితే జగన్ నుండి హామీ రాలేదట. ముందు పార్టీల చేరితే సముచిత స్ధానం కల్పిస్తామని మాత్రం చెప్పారట. నాలుగున్నరేళ్ళుగా ఇన్చార్జిగా ఉన్న మేకతోటి సుచరితను కాదని రావెలకు టిక్కెట్టు ఇవ్వటం జగన్ కు ఇష్టం లేదట. మరి వీళ్ళద్దరు ఏం చేస్తారో చూడాలి.

Next Story
Share it