Top
Sneha TV

అసహనం తో అన్ని అనర్ధాలు -అనారోగ్యాలు

X

సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి
నవంబరు 16 న అంతర్జాతీయ సహన దినోత్సవం సందర్బంగా

సహనమంటే అవతలి వారిని బలవంతము గా భరించటం కాకూడదు . అవతలివారిని అర్ధముచేసుకుని గౌరవించగలిగిన సహనం కావాలి . ప్రపంచము లో లోపిస్తున్న ఈ " సహనము" మీద దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1995 వ సంవత్సరాన్ని " ఇయర్ ఆఫ్ టాలరెన్స్ " గా జరపాలని తీర్మానించింది . సహనం ఆవశ్యకతను గుర్తించాలన్న లక్ష్యము తో ప్రకటన విడుదలైనందున ప్రతి ఏటానవంబర్ 16 న ప్రపంచ సహన దినోత్సవం' గా జరపాలని నిర్ణయించారు , వ్యతిరేక దోరణిలో కాకుండా అనుకుల దోరణి లో అలోచించాలన్న దే ఈ దినోత్సవ ముఖ్య ఉద్ధేశమని నిపుణులు తెలియజేస్తూన్నరని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలిపారు.

అసహనం నిర్ణయాత్మకతను లోపింప చేస్తుంది
అసహనంగా ఉండే మనిషి ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి లోనవుతాడు. ఒక తప్పు సరిదిద్దుకోవటానికి సరైన నిర్ణయం చేయలేక మరో తప్పుకూడా దొర్లటానికి ఆస్కారం ఉంటుంది. కంప్యూటర్‌ వెంటనే ఆన్‌
కాకపోతే అసహనం. నెట్‌ కనెక్ట్‌ వెంటనే కాకున్నా చిరాకు. నెట్‌ స్లోగా ఉన్నా అసహనమే!. వ్యక్తిగత నియంత్రణను కోల్పోయి కొన్ని సందర్భాల్లో తన గౌరవాన్ని కూడా తగ్గించుకునే పరిస్థితిని కల్పించు కుంటారు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. కార్యాలయంలో, ఇంటిలోనూ నిత్యం అసహనంగా ఉంటూ కొద్దికాలానికి వైద్యుని వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా చోటుచేసుకుంటుంది. దీనికి ప్రధానంగా సహనంగా ఉండటానికి అవలంభించాల్సిన చర్యలను అనుసరించకపోవడం ఒక కారణమైతే, ప్రస్తుత వేగవంత జీవనం మరో కారణం.

ముఖ్యంగా అసహనానికి గురైనప్పుడు అనేక రోగాల భారిన పడుతారు అలాగే వ్యాధులు వచ్చి నప్పుడు అసహనానికి గురైతే గుండె జబ్బులు, పక్షవాతం ,మొదలగు అనేక వ్యాధులు వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు కావున ఎల్లవేళల పాజిటివ్ థింకింగ్ తో ఉండాలని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలుపారు
జాగ్రత్తలు
దిన చర్యలో యోగ ,వ్యాయామాలు, ధ్యానం చెయ్యాలి. మంచి సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవాలి. కుటుంబంతో కలిసి భోజనం చెయ్యటం ,విహారయాత్రలకు వెళ్ళటం, ఈత కొట్టడం లాంటి మొదలగునవి చేస్తు ఉండటం వల్ల సహనాన్ని కోల్పోకుండా ఉండవచ్చు.సహనంతోనె సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ప్రతిరోజు ధ్యాన సాధనతో సహనం లభిస్తుందని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫీ తెలిపారు.

Next Story
Share it