Top
Sneha TV

టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం: కృష్ణయ్య

X

హైదరాబాద్: బీసీలను మహాకూటమి పార్టీలు మోసం చేశాయని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు ఆయా పార్టీలు అన్యాయం చేసినందుకు నిరసనగా 17న రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే బీసీలకు టిక్కెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశాయని కృష్ణయ్య ఆరోపించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్యకు జనగామ టిక్కెట్ లేకుండా చేశారని, తాండూరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు బీసీలవని, ఆ సీట్లు కూడా బీసీలకు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. బీసీలు గెలిచే సీట్లు, సంప్రదాయంగా వస్తున్న సీట్లు కూడా బీసీలకు ఇవ్వకుండా పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్లు పేదవాళ్ల గురించి పట్టించుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. వారు రాజకీయాలను వ్యాపారంగా మారుస్తారని కృష్ణయ్య విమర్శించారు.

Next Story
Share it