Top
Sneha TV

'గత కాంగ్రెస్ చేసిన అభివృద్దే నన్ను గెలిపిస్తుంది'

X

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కే.కే. మహేందర్ రెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటిమెంట్‌గా మొదటిసెట్ నామినేషన్ వేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి ప్రముఖ్యత లేకుండాపోయిందని విమర్శించారు. మహిళలను కించపరిచే మాదిరిగా ఈ ప్రభుత్వం ఉందని, కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించలేదని ఆయన విమర్శించారు. ఇవాళ కేసీఆర్ ప్రకటించిన స్థానల్లో కూడా మహిళలు తక్కువగా ఉన్నారని మహేందర్ రెడ్డి విమర్శించారు.

Next Story
Share it