Top
Sneha TV

గాలి జనార్దన్ రెడ్డికి బెయిలు

X

బెంగళూరు : ఆంబిడెంట్ కంపెనీ ముడుపుల కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ బ్యారన్ గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు బుధవారం బెయిలు మంజూరు చేసింది. రూ.1 లక్ష పూచీకత్తుపై ఆయనకు బెయిలు మంజూరు చేసింది.

ఫరీద్ నేతృత్వంలోని ఆంబిడెంట్ కంపెనీ సుమారు 600 కోట్ల మేరకు ప్రజల నుంచి సేకరించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో కొందరు మదుపరులు ఆ కంపెనీపై ఫిర్యాదులు చేశారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరిపింది. ఆ సమయంలో ఈడీ అధికారులను మచ్చిక చేసుకునేందుకు ఫరీద్ ప్రయత్నించారని బెంగళూరు పోలీసులు ఆరోపిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి రూ.18 కోట్ల విలువైన 57 కేజీల బంగారాన్ని మధ్యవర్తుల ద్వారా ఫరీద్ చేరవేశాడని, ఈడీ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ బంగారాన్ని ముడుపులుగా ఇచ్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

గాలి జనార్దన్ రెడ్డిని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఆయనపై కేసులు నమోదు చేశారు. ఆయనకు కోర్టు ఈ నెల 24 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వి. జగదీశ్ బుధవారం గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. రూ.1 లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు.

Next Story
Share it