Top
Sneha TV

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: బిక్షపతి యాదవ్

X

హైదరాబాద్: శేరిలింగంపల్లి టిక్కెట్ టీడీపీకి కేటాయించడంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మొదటి నుంచి ఈ స్థానాన్ని ఆశించిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ శేరిలింగంపల్లి సీటు తనకు వస్తుందనే నమ్మకం ఉందని, మరి ఎందుకు రాలేదో తెలియడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, కేడర్‌ను కాపాడుకుంటూ.. పార్టీని పటిష్టంగా తయారు చేశానని అన్నారు. తనకు సీటు ఎందుకు ఇవ్వాలేదో పీసీసీని మీడియానే అడగాలని ఆయన అన్నారు. తనకు సీటు రానిపక్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. తన విషయంలో అధిష్టానం పొరపాటు నిర్ణయం తీసుకుందని బిక్షపతి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓటమి కావాలంటే గెలిచేవారికే టిక్కెట్లు ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story
Share it