Top
Sneha TV

వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్రంలో కేసీఆర్ నామినేషన్..

X

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నామినేషన్ వేయనున్నారు. వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం సమయంలో ఆయన.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు మకర లగ్నం. మధ్యాహ్నం 1.30 నుంచి 2.50 గంటల వరకు కుంభలగ్నం. ఈ రెండు ముహూర్తాల్లో నామినేషన్ వేస్తే కేసీఆర్‌కు మరోసారి రాజయోగం వస్తుందని ఆయనకు పండితులు సూచించారు. ఈ మేరకు కేసీఆర్... బుధవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కేసీఆర్‌తో మొత్తం పార్టీ అభ్యర్థులందరికి శుభం కలుగుతుందని ఆయన నమ్ముతున్నారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ మాత్రం ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు.

కేసీఆర్‌ ఎప్పటిలాగే నామినేషన్లకు కూనాయిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెంటిమెంట్. 1985 ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఇదే సిద్ధిపేట నంగునూర్ మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి పాదాలముందు నామినేషన్ పత్రాలు ఉంచి.. వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకుని నామినేషన్ వేశారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఈ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారు కేసీఆర్. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసే ముందు కూడా ఇక్కడే నామినేషన్ పత్రాలకు పూజలు చేశారు. అనంతరం గజ్వేల్ ఆర్డీవో ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు

బుధవారం కూడా ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్‌లో కోనాయిపల్లికి వెళ్లి.. పూజలు చేసి.. మళ్లీ అక్కడి నుంచి గజ్వేల్‌కు వెళ్తారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు.

Next Story
Share it