Top
Sneha TV

గోవాలో నాయకత్వాన్ని మారుస్తాం!

X

కేంద్రమంత్రి శ్రీపాద్‌ నాయక్‌

పనాజి: గోవాలో నాయకత్వం మారాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ అభిప్రాయపడ్డారు.గోవాలో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన ఆయన గత నెల 14న తిరిగి గోవా చేరుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంటి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అయితే పారికర్‌ ఆరోగ్య పరిస్థితుల రీత్యా గోవాలో నాయకత్వం మారాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అన్నారు.

' గోవాలో నాయకత్వమార్పిడి చేసే యోచనలో ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా అవసరం. ఈరోజైనా రేపైనా మార్పు తప్పనిసరి. ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రి ఆరోగ్యం సరిగా లేదు. ఆయన సొంత పనులు కూడా వేరొకరు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తించడం అసాధ్యమనే అనుకోవాలి. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకోనున్నాం. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు' అని కేంద్ర మంత్రి తెలిపారు.

Next Story
Share it