Top
Sneha TV

మంచిర్యాల టీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు

X

మంచిర్యాల: మంచిర్యాల టిఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి ఆధ్వర్యంలో లక్షెట్టిపేటలో ఉద్యమ కారుల ఆవేదన సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. ఉద్యమకారులను పక్కకు పెట్టి కబ్జాకోరులు, మోసకారులను తాజా మాజీ ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని తిరుపతి ఆరోపించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకుని, పార్టీ కోసం పనిచేసిన వారిపై వివక్ష కొనసాగుతోందన్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని తిరుపతి డిమాండ్ చేశారు. దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో వేలాది మంది రైతులకు అందాల్సిన హమాలి డబ్బులను కూడా ఇవ్వకుండా కొందరు నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇలా అయితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. త్వరలోనే నియోజకవర్గం మొత్తం పర్యటించి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని తిరుపతి స్పష్టం చేశారు.

Next Story
Share it