Top
Sneha TV

రూ.20 కోట్లకు 'మహర్షి'?

X

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తెగ ప్రచారంలో ఉంది. చిత్ర హక్కులు తాజాగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. డి జిటల్‌, టెలివిజన్‌, డబ్బింగ్‌ హక్కుల్ని రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

'మహర్షి' సినిమాలో అల్లరి నరేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, సాయి కుమార్‌, కోటా శ్రీనివాసరావు, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత మహేశ్‌ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.

Next Story
Share it