Top
Sneha TV

హరీష్ రావు వ్యాఖ్యలకు రేవూరి కౌంటర్

X

వరంగల్: నాలుక కోస్తానంటూ టీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చంద్రబాబును తిట్టడం ద్వారా కేసీఆర్ మెప్పు పొందాలని హరీష్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆది నుంచీ ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకోవడం హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. తన నాలుక కోస్తానంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని రేవూరి డిమాండ్ చేశారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే.. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

Next Story
Share it