Top
Sneha TV

చంద్రబాబు ముందుకు పవన్ ఆధారాలు

X

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, మహాకూటమి నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో ఎన్నికలకి ఇంకాస్త సమయం ఉన్నా.. అక్కడ కూడా పొలిటికల్ హీట్ మొదలైంది. జాతీయ స్థాయిలో టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పని చేయబోతుండటంతో.. అక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఏపీలో భాజాపా పోటీ ఇచ్చే స్థితిలో లేదన్నది సుస్పష్టం.

ప్రస్తుతం మాత్రం ఏపీలో పోరాటయాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాయిస్ ఎక్కువగా వినిపిస్తోంది. ఐతే, పవన్ తిత్లీ తుపాను గురించి కేంద్రానికి లేఖ కూడా రాయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ స్పందించారు. నేను ప్రధాని మోదీకి లేఖ రాశాను. దానికి సంబంధించిన ఆధారాలు ఇవి. చూడండి అంటూ పవన్ ట్వీట్ చేశారు. దీంతో పాటు తాను రాసిన లేఖను ఆయన ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు.

దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు మీవే. జనసేన పార్టీకి సంబంధించిన వార్తలు ప్రజల్లోకి వెళ్లాలా, వద్దా అనే విషయాన్ని మీరే నియంత్రిస్తారు. మా వార్తలు బయటకు రాకుండా మీరు అడ్డుకుంటారు. ఆ తర్వాత జనసేన ఏమీ చేయలేదంటూ పబ్లిక్ లో మమ్మల్ని విమర్శిస్తారుని మండిపడ్డారు పవన్.

Next Story
Share it