Top
Sneha TV

రేవంత్‌, తెలంగాణ రాజకీయాలకు ఒక చీడపురుగు

X

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి చీడపురుగులా మారారని శాసన మండలి విప్‌ బోడకంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..రేవంత్‌ రాజకీయాలకు కాకుండా, రౌడీయిజానికో, గూండాయిజానికో పనికొస్తాడని అన్నారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో కేసిఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌ ఎప్పుడూ చంద్రబాబు మనిషేనని, చంద్రబాబు పంపిన డబ్బుతోనే పొగరుపట్లి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Next Story
Share it