Top
Sneha TV

కోదండరాం పార్టీ గుర్తు 'అగ్గిపెట్టే'

X

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టీఆర్ ఎస్ లో చేరకుండా జేఏసీ సభ్యుడిగానే కొనసాగారు. ఆ తర్వాత టీజేఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మహా కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మహాకూటమిలో టీజె ఎస్ కు 8 నుంచి 10 స్థానాలు దక్కబోతున్నాయని చెబుతున్నారు.

తాజాగా, ఆ పార్టీ ఎన్నికల గుర్తు 'అగ్గిపెట్టె'ను కోదండరామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేశాం. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం పంపుతున్నట్టు చెప్పారు. 10స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాం. మూడ్నాలుగు స్థానాల్లోనూ మాకు బలమైన అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.

ఇక, రాజకీయాల్లో పెనుమార్పుల కోసమే టీజె ఎస్ కృషి చేస్తుంది. ప్రజల ఆకాంక్ష మేరకు మహాకూటమిని నిలబెట్టే బాధ్యత తమపై ఉందది. దీపావళీ లోగా మహాకూటమిలో సీట్ల సర్థుబాటు జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Next Story
Share it