Top
Sneha TV

రైతులకు పెట్టుబడి సాయం పది వేలు చేస్తాం

X

కొల్గూరు: గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొల్గూరులో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..గజ్వేల్‌లో ప్రజా సంక్షేమం కొనసాగాలంటే టిఆర్‌ఎస్‌ను మరోమారు ఆదరించాలని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని, ప్రతి దసరాకు మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నామని చెప్పారు. టిఆర్‌ఎస్‌ నేతలు అభివృద్ధి పనులు చేస్తుంటే..కాంగ్రెస్‌ అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. హరీశ్‌ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు.

Next Story
Share it