Top
Sneha TV

విద్యార్థిని గొంతు కోసిన టీచర్...

X

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సన్మాన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సభ్య సమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలోని బంగారుపేటలో దారుణ ఘటన జరిగింది. బంగారుపేటలో రాక్డ్ స్కూల్ లో హిందీ టీచర్ గా శంకర్ పనిచేస్తున్నారు. అదే స్కూల్లో ఓ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. శనివారం ఉదయం ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లిన శంకర్ బ్లేడ్ తో దాడికి పాల్పడ్డాడు. దీనితో ఆ విద్యార్థిని గొంతు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం అదే బ్లేడ్ తో శంకర్ కూడా గొంతు కోసుకున్నాడు. ఆ సమయంలో శంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు దాడి చేశాడనేది తెలియరాలేదు. స్థానికంగా ఉన్న ప్రజలు శంకర్ ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it