Top
Sneha TV

కేసీఆర్‌ను ఓడించాలని హరీష్‌రావు కోరారు: ఒంటేరు

X

సిద్దిపేట: టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు తారాస్థాయిలో ఉందని కాంగ్రెస్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. ఒంటేరు, మంత్రి హరీష్‌రావు మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టారు. హరీష్‌రావు నాకు ఫోన్ చేసి మా మమని ఓడించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్‌రావును తప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో హరీశ్‌రావు టచ్‌లో ఉన్నారు. త్వరలో హరీశ్‌రావు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కేసీఆర్ గెలిచేవారైతే కులసంఘాలతో సమావేశాలు ఎందుకు పెడుతున్నారు? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it