Top
Sneha TV

''ఏసు ప్రభువుపైన ఆన.. మాట తప్పను''

X

హైదరాబాద్: సంగారెడ్డిలో తాను గెలిస్తే హరీష్ రావు పని అవుటే అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే ఆయన సిద్దిపేటను వదిలి సంగారెడ్డిలో నిద్ర పోతున్నారని విమర్శించారు. హరీష్ రావు, చింత ప్రభాకర్‌లు కలిసి తనపై ఎలా కేసులు పెట్టాలన్నదే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తాను నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారని, ఎక్కువ కేసులు పెట్టి తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చూస్తున్నారని ఆరోపించారు. శనివారం సంగారెడ్డిలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న జగ్గారెడ్డి.. క్రైస్తవులపై వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, తాను గెలిచిన మూడు నెలల్లోనే నియోజకవర్గంలోని చర్చిలలోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. క్రైస్తవ యువతకు ఇండస్ట్రీలలో ఉద్యోగాలిప్పిస్తానని హామీ ఇచ్చాను. 'ఏసు ప్రభువుపైన ఆన వేస్తున్నా.. మాట తప్పను, వెనక్కి వెళ్లను' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it