Top
Sneha TV

హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్‌ తనిఖీలు

X

హైదరాబాద్: హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్‌ పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 9 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికి 49 చోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. రూ.900 కోట్ల నిధుల సేకరణపై సీసీఎస్‌ ఆరా తీస్తోంది. హీరా గోల్డ్ 16 రాష్ట్రాలలో డిపాజిట్లు సేకరించింది. అనతికాలంలోనే రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ చూపింది. హీరా గోల్డ్ పెట్టుబడులు హవాలా డబ్బుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 43 చోట్ల హీరాగోల్డ్‌ ఆస్తులను సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. హీరాగోల్డ్‌ కంపెనీకి దుబాయ్‌లో హోటళ్లు, అపార్ట్‌మెంట్లుగా గుర్తించారు.

Next Story
Share it