Top
Sneha TV

మహాత్మగాంధీని గుర్తించకపోవడం సరికాదు : సీపీఐ నారాయణ

X

ఢిల్లీ : మహాత్మగాంధీ కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పవాడా ? అని సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ కూడా పటేల్ పుట్టిన గడ్డ మీదే పుట్టారని..ఆయన్నుగుర్తించకపోవడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. పేదలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే.. ప్రధాని మోడీ.. విగ్రహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించారు. దేశం కోసం పోరాడిన గాంధీని పక్కన పెట్టి పటేల్ విగ్రహం పెట్టడమంటే..ఇది చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు. ఒక వైపు పటేల్.. నిజాం నవాబును లొంగదీసుకున్న వీరుడని చెబుతున్నారు...కానీ కమ్యూనిస్టులు సాయుధపోరాటం సాగించడంతో నిజాం నవాబ్ భయపడి.. బతికుంటే బలిసాకు తిని బతకవచ్చనే ఉద్దేశంతో సరెండరైతే.. అప్పుడు పటేల్ సర్దార్ వల్లాభాయ్ పటేల్.. నిజాం నవాబును స్వాధీనం చేసుకున్నాడని తెలిపారు.

Next Story
Share it