Top
Sneha TV

బీజేపీ రెండో జాబితా...ఆశావాహుల ఆందోళన...

X

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ రెండో జాబితా విడుదల చేసిన అనంతరం ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి. టికెట్లు ఆశించిన వారికి బీజేపీ అధిష్టానం మొండిచెయ్యి చూపడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కాకుండా వేరే వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. వివిధ జిల్లాలో పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు..నిరసనలు చేపడుతుండడంతో పార్టీ పెద్దలు అంతర్మథనం చెందుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా అర్బన్ స్థానం నుండి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యె యెండల లక్ష్మీనారాయణ, నారాయణ గుప్తాలు ఆశించారు. కానీ యెండల వైపు పార్టీ మొగ్గు చూపడంతో నారాయణ గుప్తా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న గుప్తా అనుచరులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మరోవైపు శేరిలింగంపల్లి టికెట్ కోసం నరేశ్ ప్రయత్నించారు. కానీ ఇతరులకు టికెట్ కేటాయించడంతో నరేశ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. టికెట్లు అమ్ముకున్నారంటూ కార్యకర్తలు నినదిస్తు్న్నారు. పార్టీ అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి

Next Story
Share it