Top
Sneha TV

కిడారి, సోమ హత్యలపై మావోల లేఖ

X

విశాఖ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలపై జగబంధు పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆదివాసీల సంపదలను కొల్లగొడుతున్నందుకే కిడారి, సోమలను చంపినట్లుగా వెల్లడించారు. బాక్సైట్ తవ్వకాల జీవో నెంబర్ 97 పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. యూపీఏ, ఎన్డీఏ, కాంగ్రెస్, టీడీపీ ఇందుకు మినహాయింపు కాదని ధ్వతమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it