Top
Sneha TV

కేసీఆర్ గురించి శ్రీకాంతాచారి తల్లి ఏమన్నారంటే..

X

హైదరాబాద్: ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే అమరవీరులకు అన్యాయం చేసినట్టవుతుందని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. శ్రీకాంతాచారి ఎప్పుడూ కేసీఆర్ ఫొటో చూసే లేచేవాడని గుర్తుచేశారు. అమరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. ఉత్తమ్‌కుమార్ మీద పోటీ చేయడమంటే సాహసమేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సూచనను గౌరవించి పోటీ చేశానని వెల్లడించారు.

తనకు పార్టీ నుంచి సపోర్ట్ ఉందని తెలిపారు. కానీ పార్టీతో సంబంధం లేని ఎన్నారై తనకు పోటీగా వస్తున్నాడని మండిపడ్డారు. మరోసారి సర్వే చేసి తనకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అన్యాయం చేయరనే అనుకుంటున్నానన్నారు. ఒకవేళ తనకు ఇవ్వడం కుదరకపోతే.. అప్పిరెడ్డికిచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు.. ముగ్గురు ఎంపీపీలు తమకు మద్దతిస్తున్నారని ప్రకటించారు.

Next Story
Share it