Top
Sneha TV

ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం టీఆర్ఎస్‌తోనే సాధ్యం: కూసుకుంట్ల

X

మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎన్నికల ఎజెండాగా ఉన్న ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి శాస్వత చర్యలు తీసుకోవడం టీఆర్ఎస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. తాగునీరు అందించాలన్న, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. మరోసారి కేసీఆర్ ముఖ్యంత్రి కావాలని ఓటర్లను కూసుకుంట్ల అభ్యర్థిస్తున్నారు. మునుగోడులో మహాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగినా.. తనదే విజయమని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రజలే తన కుటుంబంగా భావించి నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నట్లు చెప్పారు. ఎక్కడికి వెళ్లిన ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని కూసుకుంట్ల తెలిపారు.

ఎక్కడా లేని విధంగా మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య ఉందని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఫోరైడ్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఫ్లోరైడ్ సమస్య శాశ్వత పరిష్కారానికి ఆలోచించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సమస్యకు శాస్వత పరిష్కారం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఫ్లోరైడ్‌కు తాగునీరు 10 శాతం అయితే, 90 శాతం సాగునీరు కావాలని.. ఇవి సాధ్యమైతే ఫ్లోరైడ్‌కు శాస్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవన్నీ పూర్తి కావాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story
Share it