Top
Sneha TV

శ్రీనివాసరావును మరోసారి కస్టడీ కోరిన పోలీసులు.. నిరాకరించిన కోర్టు

X

విశాఖ: విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై కత్తితో దాడి చేసి తెలుగురాష్ట్రాల్లో శ్రీనివాసులు అనే వ్యక్తి సంచలనం సృష్టించాడు. దాడి చేసిన వెంటనే నిందితుడి పోలీసుల అరెస్ట్ చేశారు. అనంతరం శ్రీనివాసరావు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆదేశాలతో అతడిని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడిని వివారించేందుకు పోలీసులు కోర్టు ఆశ్రయించారు. శ్రీనివాసరావును ఆరు రోజులు పాటు పోలీసులు కస్టడీకి అనుమతిచ్చింది. కోర్టు అనుమతితో శ్రీనివాసరావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో లోతుగా విచారించారు.పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి కాల్ డేటా ఆధారంగా విచారించారు.

జగన్‌పై దాడి కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి పోలీసులు చెబుతున్నారు. వివరాలు ఇప్పుడే వెల్లడించబోమని పోలీసులు అంటున్నారు. శ్రీనివాసరావు తల్లిదండ్రులు అతనిని కలిసిన సందర్భంలో కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షలు జరిపే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారంతో శ్రీనివాసరావు కస్టడీ ముగిసింది. శ్రీనివాసరావును మరోసారి కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. పోలీసులు పిటీషన్‌ను న్యాయస్ధానం తిరస్కరించింది. శ్రీనివాసరావు కస్టడీని కోర్టు నిరాకరించింది. నిందితుడిని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. శ్రీనివాసరావుకు ఈ నెల 9 వరకు రిమాండ్‌ను కోర్టు పొడగించింది.

సీబీఐ కోర్టుకు వాయిదా కోసం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌పై శ్రీనివాసరావు దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి ఘటనతో జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతడి చేతి నుంచి కత్తి లాక్కున్నారు. శ్రీనివాసరావును విమానాశ్రయంలో భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లకు అప్పగించారు. వాళ్లు శ్రీనివాసరావును మరో గదిలోకి తీసుకెళ్లారు. సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ దినేశ్‌ కుమార్‌ ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా శ్రీనివాసరావుపై 307 ఐపీసీ (హత్యాయత్నం) కింద కేసు నమోదుచేశారు

Next Story
Share it