Top
Sneha TV

తెరపై కి మరో కాపీ కథ వివాదం.

X

ఈ మధ్య అన్ని ఇండస్ట్రీ లలో కాపీ కథ వివాదాలు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాట మొన్నటి వరకు సర్కార్ చిత్ర కథ ఎంతటి వివాదం గా మారిందో తెలియంది కాదు..ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడం తో సర్కార్ మేకర్స్ రాజీ చేసుకొని వివాదాన్ని సద్దుమనిగేలా చేసారు. ఈ వివాదం మరచిపోకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది.

విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన '96' చిత్రం కొన్ని రోజుల క్రితం విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రం కథ తన శిష్యుడిది అంటూ ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా వివాదానికి తెరలేపారు. భారతి రాజా శిష్యుడు సురేష్ ఈ కథను కొన్ని సంవత్సరాల క్రితం రాసుకున్నాడట. అప్పట్లోనే సురేష్ తన మిత్రుడు అయిన మరుధ పాండియన్ తో కథను షేర్ చేసుకున్నాడట. కథ విని బాగుందన్న మధుర పాండియన్ ఆ స్టోరీ లైన్ ను ప్రేమ్ కుమార్ కు వినిపించాడని - ప్రేమ్ కుమార్ '96' పేరుతో ఆ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ భారతీ రాజా అంటున్నాడు.
మధుర పాండియన్ ను సురేష్ స్నేహితుడు అని నమ్మి కథ చెబితే అతడు సురేష్ కు వెన్ను పోటు పొడిచిందని రాజా వాపోతున్నాడు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Next Story
Share it