Top
Sneha TV

ఎన్నికల ముందు బీజేపీకి షాకిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి

X

బెంగళూరు: కర్ణాటకలోమరో రెండ్రోజుల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో రామ్‌నగర్ అసెంబ్లీ అభ్యర్థి చంద్రశేఖర్ యూటర్న్ తీసుకున్నారు. ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రాగా ఉపఎన్నికల్లో రామ్‌నగర్‌ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే ఉన్నట్టుండి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పడంతో బీజేపీ పెద్ద షాక్ తగినట్లైంది.

బీజేపీ నుంచి తప్పుకోవడానికి కారణాలు ఆయన మాటల్లోనే.." రాష్ట్ర బీజేపీ నేతలందరూ నాకు సపోర్టు చేస్తానంటేనే నేను రామ్‌నగర్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యాను. అయితే నాకు ఎవరైతో అండగా ఉంటానని మాటిచ్చారో వారెవ్వరూ నాతో పాటు కలిసిరాలేదు.. కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. అంతేకాదు కనీసం ప్రచారానికి కూడా రాలేదు. అందుకే తీవ్ర ఆవేదనతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను" అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే అనిత విజయం దాదాపు ఖాయమనట్లేనని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే చంద్రశేఖర్ బీజేపీ నుంచి తప్పుకోవడంపై ఇంత వరకూ ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరూ స్పందిచలేదు.

కాగా.. ఈ నియోజకవర్గం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత జేడీఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,06,360 మంది ఉండగా ఇందులో 1.02లక్షల మంది పురుష ఓటర్లు, 1.03 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

Next Story
Share it